ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ భవనాల కూల్చివేతతో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునఃప్రారంభానికి చర్యలు తీసుకోగా, కేంద్రం ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి భూమిని వేలం వేసే దిశగా అడుగులు వేసినట్లు సమాచారం.





