నల్గొండ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలు అపహరణ యత్నం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. నకిరేకల్ నుంచి ఉట్కూర్కు వెళ్తుండగా ఆటో డ్రైవర్ మార్గం మార్చి ఇనుపాముల గుట్ట వైపు వెళ్లడంతో అనుమానం వచ్చిన బాలికలు కదులుతున్న ఆటో నుంచి దూకారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరికీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.