న్యూఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ర్యాలీకి ముందు అదుపులోకి తీసుకున్న AISA అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. మరోవైపు, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అరెస్టు చేసి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.